Pushpa-2: అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు చేసిన అధికారులు
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుSandhya Theater stampede case) నేపథ్యంలో అల్లు అర్జున్(Allu Arjun) ఇంటి వద్ద భద్రతను(Security) కట్టుదిట్టం చేశారు.
దిశ, వెబ్ డెస్క్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుSandhya Theater stampede case) నేపథ్యంలో అల్లు అర్జున్(Allu Arjun) ఇంటి వద్ద భద్రతను(Security) కట్టుదిట్టం చేశారు. అధికారులు హీరో ఇంటి చుట్టూ పరదాలు(Curtains) ఏర్పాటు చేస్తున్నారు. పుష్ప-2(Pushpa-2) ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు రావడంతో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ(Sriteja) ప్రాణాపాయ స్థితిలో కిమ్స్ ఆసుపత్రిలో(KIMS Hospital) చికిత్స పొందుతున్నాడు. ఈ విషయానికి రాజకీయ రంగు పులుముకొని తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పై తీవ్ర ఆగ్రహానికి గురైన కొందరు ఓయూ జేఏసీ నేతలు(OU JAC leaders) రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్(Jubilee Hills)లోని ఆయన నివాసంపై దాడికి తెగబడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అంతేగాక మరోసారి ఇలాంటి అవాంఛిత దాడులు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు లోపలికి.. లోపలి వ్యక్తులు బయటికి కనిపించకుండా తెల్లటి గుడ్డలతో అల్లు అర్జున్ ఇంటిని కప్పేశారు. కాగా ఈ ఘటనలో విచారణకు రావాలని చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన ఇవాళ చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
Read More...
KIMs Hospital: అల్లు అర్జున్‌కు MP ఈటల రాజేందర్ కీలక సూచన