Vemulawada:రాజన్నను దర్శించుకున్న పుష్ప-2 నటి
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ(Vemulawada) శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని(Sri Rajarajeswara Swamy Temple) నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు.
దిశ,వెబ్‌డెస్క్: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ(Vemulawada) శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని(Sri Rajarajeswara Swamy Temple) నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు(గురువారం) ఉదయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని తెలుగు సినీ నటి(Telugu film actress) గార్లపాటి కల్పలత(Ingenuity of Garalpati) దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు లడ్డు ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. ఇటీవల సినీ నటి కల్పలత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన పుష్ప-2 సినిమాలో(Pushpa–2 Movie) నటించిన విషయం తెలిసిందే.