రెచ్చగొట్టి ఆర్టీఫిషియల్ ఉద్యమాలు.. : తెలంగాణ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి

నిరుద్యోగ యువకులు కొందరి ప్రొద్భలంతో ఆందోళనలు చూస్తున్నారని తెలంగాణ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి అన్నారు.

Update: 2024-07-15 08:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగ యువకులు కొందరి ప్రొద్భలంతో ఆందోళనలు చూస్తున్నారని తెలంగాణ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి అన్నారు. సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రెచ్చ గొట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని సూచించారు. విద్యార్థుల బలిదానం, త్యాగాలను గుర్తించి తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారన్నారు. లక్షా 7వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేసీఆర్ చెప్పారని.. వాటిని భర్తీ చేయక ఆయన దిగిపోయే నాటికి చనిపోయే వాటిని కలుపుకుంటే రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. నిరుద్యోగులపైన ప్రేమ ఉంటే ఉద్యమంలో విద్యార్థుల ప్రాణత్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ మూడు నెలల్లో ఉద్యోగాలు నింపవచ్చని తెలిపారు.

కాని ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. తెలంగాణలో యూనివర్సిటీలలో టీచింగ్ స్టాఫ్ లేదని.. ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ట అడుగంటి పోయేలా చేసింది కేసీఆర్ సర్కార్ అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ చేస్తామని చెప్పిందన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.

గ్రూప్-1 నోటిఫికేషన్ వేస్తే విద్యార్థులు పరీక్షలు రాశారు.. రిజల్ట్స్ కూడా వచ్చాయన్నారు. మెయిన్స్ షెడ్యూల్ కూడా ఇచ్చామన్నారు. కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తున్న కేసీఆర్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంట్రల్ ఏర్పాటు చేయబోతున్నామని.. 30 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోతే మా ప్రభుత్వం గొప్ప కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. విద్యార్థులు దయచేసి తప్పుడు మాటల వినొద్దని రిక్వెస్ట్ చేశారు. ఈ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

Tags:    

Similar News