‘అక్షర చిట్ ఫండ్’ ఎదుట బాధితుల ఆందోళన (వీడియో)

గడువు ముగిసినా చిట్టీ వేసిన డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ డిపాజిట్ దారులు చిట్ ఫండ్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు.

Update: 2023-02-28 09:02 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: గడువు ముగిసినా చిట్టీ వేసిన డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ డిపాజిట్ దారులు చిట్ ఫండ్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జగిత్యాల పట్టణంలోని అక్షర చిట్ ఫండ్స్ డిపాజిట్ దారులు తాము వేసిన చిట్స్ డిపాజిట్ల తాలూకు గడువు ముగిసినప్పటికీ నిర్వాహకులు తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కార్యాలయ సిబ్బందిని లోపలే ఉంచి కార్యాలయాన్ని మూసివేశారు.

అనంతరం కార్యాలయం ఎదుట బైఠాయించి చిట్ ఫండ్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డబ్బులు తమకు ఇచ్చేంత వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. కాయకష్టం చేసుకుని దాచుకున్న డబ్బులు అని నాలుగైదు నెలల నుండి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదని కొంతమంది బాధితులు ఆవేదన వ్యక్తం చేసారు.

అయితే చిట్ ఫండ్ నిర్వాహకులు ఖాతాదారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కరోనా సమయంలో కొంతమంది ఖాతాదారులు వాయిదాల ప్రకారం డబ్బులు చెల్లించలేదని మరికొందరు కోర్టును ఆశ్రయించారన్నారు. త్వరలోనే డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags:    

Similar News