కాంగ్రెస్ పార్టీకి మహాత్మ గాంధీ అధ్యక్షుడై వందేళ్లు.. మహేశ్ కుమార్ గౌడ్ కీలక పిలుపు

మహాత్మా గాంధీ(Mahatma Gandhi) ఏఐసీసీ(AICC) అధ్యక్షుడు అయ్యి వందేళు పూర్తవుతున్న సందర్భంగా, రాజ్యాంగం(India Constitution) అమలులోకి వచ్చి 75 ఏళ్ళు అయిన సందర్భంగా ఏఐసీసీ

Update: 2025-04-01 16:28 GMT
కాంగ్రెస్ పార్టీకి మహాత్మ గాంధీ అధ్యక్షుడై వందేళ్లు.. మహేశ్ కుమార్ గౌడ్ కీలక పిలుపు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: మహాత్మా గాంధీ(Mahatma Gandhi) ఏఐసీసీ(AICC) అధ్యక్షుడు అయ్యి వందేళు పూర్తవుతున్న సందర్భంగా, రాజ్యాంగం(India Constitution) అమలులోకి వచ్చి 75 ఏళ్ళు అయిన సందర్భంగా ఏఐసీసీ సూచన మేరకు దేశవ్యాప్తంగా జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను చేపడుతున్నామని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో కమిటీ, రెండు నియోజక వర్గాలకు ఒక కో ఆర్డినేటర్‌ను నియమించామని, డీసీసీ అధ్యక్షులు కో-ఆర్డినెటర్లు గ్రామ స్థాయిలో అభియాన్ కార్యక్రమాలను చేస్తున్నారని అన్నారు. రేపటి నుంచి అభియాన్ పాదయాత్రలు ప్రతి మండలంలో, డివిజన్లలో ప్రారంభం అవుతున్నాయని ఈ కార్యక్రమంలో ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు విధిగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.



 


Tags:    

Similar News