తెలంగాణ ప్రజలు అందరూ ఉద్యమంలో భాగమే: ప్రొ. కోదండరాం కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందడి నెలకొంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటై జూన్ 2తో పదేళ్లు పూర్తి కావస్తోన్న

Update: 2024-05-29 17:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందడి నెలకొంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటై జూన్ 2తో పదేళ్లు పూర్తి కావస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర దశాబ్ధి వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా అవతరణ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అనంతరం ట్యాంక్ బండ్‌పై ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా పేరుగాంచిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో పాటు రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ప్రాణాలు ఆర్పించిన అమరవీరుల కుటుంబాలను ఆహ్వానించనున్నారు.

ఈ క్రమంలో రాష్ట్ర అవరతణ దినోత్సవ వేడుకలపై తెలంగాణ ఉద్యమకారులు, ప్రొఫెసర్ కోదండ రాం కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన ఓ మీడియా ఛానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు అందరూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగమేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ చేయించడంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీది కీలక పాత్ర అని కొనియాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లు తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరిని ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆహ్వానిస్తున్నామని కోదండ రాం అన్నారు. 


Similar News