అగ్గిపెట్టె ధరలపై నాగేశ్వరరావు ట్వీట్.. ఇండియా మారుతోందంటూ..
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వంపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు గత కొన్ని రోజులుగా
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వంపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తూ చర్చకు దారితీస్తున్నారు. పెట్రో ధరలపై, గవర్నర్ ఇష్యూపై మాట్లాడిన ఆయన .. తాజాగా అగ్గిపెట్టెల ధరలు పెరిగాయంటూ కేంద్రంపై మండిపడుతూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. '' 14 ఏళ్ల తర్వాత అగ్గిపెట్టె ధర పెరిగి రూ.1 నుంచి రూ.2 కి చేరింది. అగ్గిపెట్టెల పరిశ్రమ సంక్షోభాన్ని ఎదురుకొంటుంది, మైనం, ఎరుపు భాస్వరం, సల్ఫర్, నీలం రంగు వంటి ముడి పదార్థాల ధరలు 60 శాతం నుంచి 140 శాతంకి పెరిగాయి.'' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.