బీజేపీ అనుకూల ఉపాధ్యాయ సంఘం నేత లీక్ చేశారు..: సబితా ఇంద్రారెడ్డి
టెన్త్ ఎగ్జామ్ లీక్ వ్యవహారం, బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
దిశ, వెబ్‌డెస్క్: టెన్త్ ఎగ్జామ్ లీక్ వ్యవహారం, బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మీడియాతో మాట్లాడారు. 50 వేల మంది పరీక్షా నిర్వహణ విధుల్లో ఉన్నారన్నారు. రాజకీయ కోణంలో మాత్రమే పేపర్ లీక్ అవుతోందన్నారు. టెన్త్ పేపర్‌ను వాట్సాప్‌లో షేర్ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టెన్త్ పేపర్ ఎవరు లీక్ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎగ్జామ్ మొదలయ్యాక పేపర్‌ను షేర్ చేస్తే విద్యార్థులకు ఏం లాభమన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ అనుకూల ఉపాధ్యాయ సంఘం నేత తెలుగు పేపర్ లీక్ చేశారని మండి పడ్డారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. మతం పేరుతో, కులం పేరుతో రాజకీయం చేసినా లబ్ధి లేదని విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. నిన్న టెన్త్ పేపర్ వైరల్ చేసిన వ్యక్తి బండి సంజయ్ అనుచరుడు అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆగం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. పేపర్ లీక్ కు పాల్పడిన ప్రశాంత్ మొదట పేపర్‌ను బండి సంజయ్‌కే పంపారన్నారు. బండి సంజయ్ డబ్బులు ఇచ్చి మరి పేపర్ లీక్‌లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మీ రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దన్నారు.