ఆ పని చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయండి: ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు
యువ సంఘర్షణ సభలో అధికార బీఆర్ఎస్ పార్టీపై ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: యువ సంఘర్షణ సభలో అధికార బీఆర్ఎస్ పార్టీపై ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. నయా జాగీర్దార్ల తరహాలో బీఆర్ఎస్ పాలన ఉందని.. బీఆర్ఎస్ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చే ప్రభుత్వం కాదని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని.. మరీ ఇంటికో ఉద్యోగం వచ్చిందా అని ప్రియాంక ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ చేసి.. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. ఉద్యోగాల భర్తీ లేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ యూనివర్శిటీలు ఏర్పాటు చేయడం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువత, నిరుద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌ను అమలు చేయకపోతే తమ ప్రభుత్వాన్ని కూల్చేయండని ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ కాంగ్రెస్ నేతల ముందే ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read...
కాంగ్రెస్‌కు బుద్ధి.. జ్ఞానం ప్రసాదించాలి..!