జాబ్ కావాలంటే ఆ పని చేయండి: నిరుద్యోగులకు ప్రియాంక గాంధీ కీలక పిలుపు
తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై కాంగ్రెస్కు విజన్ ఉందని ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తెలంగాణకు వచ్చిన
దిశ, వెబ్డెస్క్: తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై కాంగ్రెస్కు విజన్ ఉందని ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తెలంగాణకు వచ్చిన ప్రియాంక గాంధీ ఖానాపూర్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గిరిజనులు, ఆదివాసీల కోసం ఎంతో చేశారని, ఆదివాసీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఇందిరాగాంధీ రాజకీయాలు చేశారని, రాజకీయాల్లోకి ఎందరో వస్తారు కానీ కొందరే గుండెల్లో నిలిచిపోతారన్నారు.
ఇందిరాగాంధీ చనిపోయి 40 ఏండ్లు అయిన ఇప్పటికీ ఆమెను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. పోడు పట్టాల పేరుతో సీఎం కేసీఆర్ ఆదివాసీలను మోసం చేశారని మండిపడ్డారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలు తెలిసే సోనియా తెలంగాణ ఇచ్చారు, కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చి పదేళ్లు అయిన ప్రజల స్వప్నం నేరవేరలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రంలో జీవితాలు మారుతాయని ఉద్యమకారులు కలలు కన్నారు కానీ అలాంటిదేమి జరగలేదని విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని యువతకు కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని.. కేవలం ఆయన కుటుంబంలో మాత్రమే నలుగురికి ఉద్యోగాలు ఇచ్చారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీ వైఫల్యం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ కావాలంటే కేసీఆర్ జాబ్ తీసేయండిని, కల్వకుంట్ల ఫ్యామిలీ ఉద్యోగాలను పీకేయాలని అన్నారు. ఎన్నికల్లో ఆ పని చేస్తే నిరుద్యోగులకు కొలువులొస్తాయని ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read More..
110 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం: రేవంత్ రెడ్డి