ఒకవైపు ఎగ్జామ్స్.. మరో వైపు అడ్మిషన్స్.. ప్రైవేట్ స్కూల్స్ దందా
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్‌పరీక్షలు ఇంకా మొదలవ్వనే లేదు.. అంతలోనే పలు కార్పొరేట్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్‌పరీక్షలు ఇంకా మొదలవ్వనే లేదు.. అంతలోనే పలు కార్పొరేట్స్కూళ్లు, కాలేజీలు అడ్మిషన్స్వేటలో పడ్డాయి. మే 6వ తేదీ నుంచి ఇంటర్‌పరీక్షలు ప్రారంభమవుతుండగా, మే 23 నుంచి 10వ తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. అంతకుముందు షెడ్యూల్‌ప్రకారం కాకుండా ఎలా పడితే అలా అడ్డగోలుగా పలు ప్రైవేట్‌యాజమాన్యాలు దందాను షురూ చేశాయి. గుట్టుచప్పుడు కాకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. అడ్డగోలుగా ఫీజులు పెంచేసి తల్లిదండ్రులపై భారాన్ని మోపుతున్నాయి. తర్వాత తమ పిల్లలకు సీట్లు దొరుకుతాయో లేదోనని భయాందోళనతో ఉన్న పేరెంట్స్కొందరు అడ్మిషన్స్తీసుకునేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంకొందరు ఆలస్యం చేస్తే ఫీజులు మరింత పెరుగతాయేమోనని భయంతో సీట్లు కన్ఫామ్చేసుకుంటున్నట్లు సమాచారం. ఇలా ప్రైవేట్, కార్పొరేట్స్కూళ్లు ఇష్టం వచ్చిన సమయంలో అడ్మిషన్స్తీసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోగా ఫీజుల నియంత్రణపై కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో లక్షలో ఫీజులు దండుకుంటున్నారు.
తెలంగాణలో పలు కార్పొరేట్స్కూళ్లు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. కేవలం ఎల్కేజీ, యూకేజీ కే కనీసం ఏడాదికి రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలు వసూలు చేస్తున్నాయి. 1వ తరగతి విద్యార్థులకైతే ఏకలంగా రూ.4 లక్షల వరకు కార్పొరేట్యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్కాకుండా మధ్య స్థాయిలో ఉన్న స్కూళ్లలో ఫస్ట్క్లాస్విద్యార్థులకు రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు యాజమాన్యాలు రేట్లు ఫిక్స్చేశాయి. లో ఫీ బడ్జెట్ స్కూళ్లలో రూ.30 వేల నుంచి మొదలు రూ.50 వేల వరకు ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా అత్యధికంగా ఫీజులు ఉన్న రాష్ట్రం తెలంగాణనే కావడం గమనార్హం. దేశంలోని అన్ని మెట్రో పాలిటన్సిటీలతో పోల్చుకుంటే తెలంగాణలోని ఫీజుల దోపిడీ అధికంగా ఉందని చెబుతున్నారు. ఒక గ్లోబల్, ఇంటర్నేషనల్స్కూళ్ల ఫీజుల వసూళ్లు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనేంతగా పరిస్థితి ఏర్పడింది. పటిష్టమైన ఫీజు రెగ్యులేటరీ కమిటీ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా పేరెంట్స్అసోసియేషన్చెబుతోంది.
తెలంగాణలోని పలు కార్పొరేట్ స్కూళ్లు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అది భరించలేక తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే కొవిడ్ తో ఉపాధి కోల్పోయి సంక్షోభంలో ఉన్న పేరెంట్స్ఎందరో ఉన్నారు. ఇప్పుడిప్పుడే అంతా సర్దుకుంటుందన్న తరుణంలో ఇప్పటి నుంచే పలు స్కూళ్లు ముక్కు పిండి వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఫీజుల నియంత్రణకు గాను 2017 లో ప్రొఫెసర్తిరుపతిరావు కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీలో విద్యాశాఖ అధికారులు, ప్రైవేట్‌స్కూళ్ల యాజమాన్యాలు, పేరెంట్స్కలిపి మొత్తం 11 మంది సభ్యులున్నారు. ఇప్పటి వరకు ఆ కమిటీ 7 సమావేశాలు నిర్వహించింది. 2017 డిసెంబర్ చివరి వారంలో ఒక నివేదిక సమర్పించింది. అయితే ఆ కమిటీలో ఎక్కువ మంది సభ్యులు ప్రైవేట్ యాజమాన్యాలకు చెందిన వ్యక్తులే కావడంతో ప్రతి ఏటా పది శాతం ఫీజులు పెంచుకోవాలని నిర్ణయించారు. దీనిపై పేరెంట్స్అసోసియేషన్వ్యతిరేకించడంతో మిన్నకుండిపోయారు. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు గాను కేబినెట్సబ్కమిటీని నియమించింది. అయితే వారు కూడా తిరుపతిరావు కమిటీ సలహాలు స్వీకరించినట్లు తెలుస్తోంది.
కేబినెట్సబ్కమిటీ తిరుపతి రావు కమిటీ రూపొందించిన 10 శాతం ఫీజు పెంపు అంశాన్ని అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రతి పాఠశాలకు స్కూల్లెవల్ ఫీ రెగ్యులేటరీ కమిటీ పెట్టాలని నిర్ణయించింది. పాఠశాల మేనేజర్కమిటీకి చైర్మన్‌గా ఉంటే, కరస్పాండెంట్ కమిటీకి కన్వీనర్ గా నియమించినట్లు తెలుస్తోంది. కమిటీ సభ్యులుగా ముగ్గురు టీచర్లు, ఐదుగురు పేరెంట్స్ ఉండాలని నిర్ణయించారు. అయితే ఆ పేరెంట్స్కూడా ప్రైవేట్యాజమాన్యాలకు అనుకూలంగా ఉండేవారినే ఎన్నుకునే అవకాశాలుంటాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిని ప్రభుత్వం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే పేరెంట్స్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా తమిళనాడు, రాజస్థాన్రాష్ట్రాల్లో మాత్రమే ఫీజు నియంత్రణ కమిటీ పటిష్టంగా అమలవుతోందని, ఇతర చోట్ల ఆ పరిస్థితి లేదని పేరెంట్స్అసోసియేషన్సభ్యులు చెబుతున్నారు. అక్కడి కమిటీ ప్రతి మూడేళ్లకోసారి ఏ స్కూల్‌కు ఎంత ఫీజు పెంచాలనేది నిర్ణయిస్తుంది. కానీ తెలంగాణలో అంత పటిష్టమైన యంత్రాంగం లేకపోవడమే ఈ ఇబ్బందుకు ప్రధాన కారణమని వారు ఆరోపిస్తున్నారు.
ఫీజులు పెంచొద్దు
ప్రైవేట్‌స్కూళ్లలో ఫీజుల దోపడీని నియంత్రించాలి. ఫీజు నియంత్రణ చర్యలను ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలి. తెలంగాణలోనూ తమిళనాడు, రాజస్థాన్విధివిధానాలను అమలు చేయాలి. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ మంత్రికి నివేదిక అందించాం. అయినా వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి కొన్ని ప్రైవేట్, కార్పొరేట్స్కూళ్లు అడ్డగోలుగా ఫీజులు పెంచి వసూలు చేస్తున్నాయి. కొవిడ్‌కారణంగా ఇబ్బందులు పడినట్లు చెప్పి కొన్ని స్కూళ్లు 20 శాతం నుంచి ఏకంగా 30 శాతం వరకు పేరెంట్స నుంచి దండుకుంటున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలి-నాగటి నారాయణ, తెలంగాణ పేరెంట్స్‌అసోసియేషన్ అధ్యక్షుడు