బీజేపీకి ఓటు వేయాలని తెలుగులో రిక్వెస్ట్ చేసిన ప్రధాని

తెలంగాణలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని ప్రధాని మోడీ రిక్వెస్ట్ చేశారు. సోమవారం జగిత్యాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.

Update: 2024-03-18 07:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని ప్రధాని మోడీ రిక్వెస్ట్ చేశారు. సోమవారం జగిత్యాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య పండుగ మొదలైంది. తెలంగాణ ప్రజలు కొత్త ఇతిహాసాన్ని లిఖించేందుకు సిద్ధమయ్యారు. వికసిత భారత్‌లో భాగంగా దేశం అభివృద్ధి చెందితే.. తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. నేను గత మూడ్రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు రెండోసారి వచ్చాను. ఆదిలాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం.

తెలంగాణలోని ప్రతి మారుమూల ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాం. నా ముందు శక్తి స్వరూపులైన వేషధారణలో ఉన్న చిన్నారి ఉంది.. ఆమెతో పాటు ఇంతమంది శక్తి స్వరూపులైన మహిళలు నన్ను ఆశీర్వదించేందుకు వచ్చారు. బీజేపీకి శక్తి స్వరూపులైన మహిళలంతా అండగా ఉన్నారు. తెలంగాణ పుడమి సాధారణమైనది కాదు. ఆంగ్లేయులు, రజాకార్ల అత్యాచారాలపై పోరాడిన గడ్డ. తెలంగాణలో బీజేపీని గెలిపించి.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను సాఫ్ చేయండి’ అని ప్రధాని మోడీ తెలుగులో కోరారు.

Tags:    

Similar News