రేపే తెలంగాణకు ప్రధాని మోడీ.. షెడ్యూల్‌లో అనూహ్య మార్పులు!

ప్రధాని మోడీ శనివారం తెలంగాణకు రానున్నారు. రూ.6 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

Update: 2023-07-06 23:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ శనివారం తెలంగాణకు రానున్నారు. రూ.6 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా రూ. 500 కోట్లతో కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్‌‌‌‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రూ. 5,550 కోట్ల విలువైన 176 కిలోమీటర్ల పొడవైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో నాగ్‌‌‌‌పూర్-విజయవాడ కారిడార్‌‌‌‌లోని 108 కిలోమీటర్ల మేర మంచిర్యాల-వరంగల్ సెక్షన్‌లో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సెక్షన్‌లో మంచిర్యాల-వరంగల్ మధ్య దాదాపు 34 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. అలాగే ఎన్‌హెచ్ 563లోని 68 కిలోమీటర్ల పొడవైన కరీంనగర్-వరంగల్ రెండు లేన్ల రహదారిని నాలుగు లేన్లుగా అప్ గ్రేడ్ చేయనున్నారు.

ఇది హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, కాకతీయ మెగా టెక్స్‌‌‌‌టైల్ పార్క్, వరంగల్‌‌‌‌లోని సెజ్‌‌‌‌లకు కనెక్టివిటీని మెరుగుపరచడంలో దోహదపడనుంది. అయితే ఇవన్నీ హన్మకొండా ఆర్ట్స్ కాలేజీ నుంచి వర్చువల్2గా మోడీ ప్రారంభించనున్నారు. ఈ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థానపల అనరంతరం ఆర్స్ట్ కాలేజీలో నిర్వహించే భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. బీజేపీ శ్రేణులు సభ ఏర్పాట్లలో ఉన్నారు. అన్ని జిల్లాల నుంచి నేతలను తరలించేంలా ఏర్పాట్లు చేస్తున్నారు. జన సమీకరణకు ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయ బాధ్యతలను నేతలకు అప్పగించారు. ఒక్కొక్కరికి పలు ప్రాంతాలను కేటాయించారు. దీంతో వారంతా తమకు అప్పగించిన పనుల్లో నిమగ్నమయ్యారు.

ప్రధాని షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

ప్రధాని మోడీ వరంగల్ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఓరుగల్లుకు వస్తున్న ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. శనివారం ఉదయం 9:25 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి మోడీ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10:15 గంటలకు వరంగల్ మామునూరు విమానాశ్రయానికి రీచ్ అవుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భద్రకాళి ఆలయానికి వెళ్లి అమ్మవారిని ప్రధాని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం నేరుగా ఆర్ట్స్ కాలేజీ మైదానానికి వెళ్తారు. అక్కడి నుంచే ఆయా అభివృద్ధి పనులకు వర్చువల్ శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:20 గంటల వరకు పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు. సభ ముగిసిన అనంతరం తిరిగి మామునూరు ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గం ద్వారా చేరుకుని హకీంపేటకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 1:45 గంటలకు హకీంపేట నుంచి ప్రత్యేక విమానంలో రాజస్థాన్ బికనీర్‌కు పయనమవుతారు.

Tags:    

Similar News