శంఖుస్థాపనలే కాదు.. వాటిని కంప్లీట్ చేస్తాం.. అదే మా వర్క్ కల్చర్: ప్రధాని మోడీ
నిజామాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. రూ. 8 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. తెలంగాణలో 20 క్రిటికల్ కేర్ బ్లాకులకు శంఖుస్థాపన
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. రూ. 8 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. రూ.6 వేల కోట్లతో నిర్మించిన ఎన్టీపీసీని 800 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టును ఇందూర్వేదికగా జాతికి అంకితం చేశారు. తెలంగాణలో 20 క్రిటికల్ కేర్ బ్లాకులకు శంఖుస్థాపన చేయడంతో పాటు.. మనోహరాబాద్-సిద్ధిపేట, సిద్ధిపేట- సికింద్రాబాద్ రైల్వేలైన్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. మా ప్రభుత్వం శంఖు స్థాపనలే కాదు.. వాటిని పూర్తి చేస్తుందని.. ఇది తమ వర్క్ కల్చరని అన్నారు. తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలు తీర్చేందుకు మేము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో భారతీయ రైల్వే వందశాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తవుతుందని తెలిపారు.