Adulterated ginger paste: కాళ్లతో తొక్కుతూ రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్.. హైదరాబాద్ లో ఘోరం!

రోజు రోజుకు కల్తీ మాఫియా రెచ్చిపోతున్నది.

Update: 2024-08-13 09:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగాలు, పని ఒత్తిడి కారణంగా ప్రజలుకు రెడీమేడ్ ఆహార పదార్థాలు, దినుసుల వైపు మళ్లుతున్నారు. అయితే ప్రజల అవసరాలను అదునుగా చేసుకుని కల్తీ మాఫియా రెచ్చిపోతున్నది. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతూ నిత్యావసర సరుకుల్లో దేన్నీ వదలకుండా కల్తీతో పేట్రేగిపోతున్నారు. టాస్క్ ఫోర్స్ అధికారు, ఎస్ఓటీ పోలీసులు దాడులు చేస్తున్నా కేటుగాళ్లు మాత్రం తమ దందాలను యధేచ్ఛగా కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా కాళ్లతో తొక్కుతూ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్న ఓ ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఓ ఎక్స్ (ట్విట్టర్) యూజర్ ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఇది హైదరాబాద్ మలక్ పేటలోని శంకర్ నగర్ కు చెందిన అపరిశుభ్రమైన అక్రమ వెల్లుల్లి ఫ్యాక్టరీ అని పేర్కొన్నాడు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టును కాళ్లతో తొక్కుతూ తయారు చేస్తున్నారు. అయితే ఇది ఎప్పుడు జరిగింది అనే వివరాలు తెలియనప్పటికీ ఇందులో చిన్నారుల చేత ఈ పేస్టు తయారీ పనులు చేయిస్తున్నట్లుగా ఉంది. కాగా ఇప్పటికే నగరంలో నగరంలో కల్తీ అల్లం పేస్టును తయారు చేసి యధేచ్చగా విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూశారు. కాసుల కక్కుర్తితో అల్లం వెల్లుల్లి పేస్టు నిల్వ ఉండటానికి హానికారక టైటానీయం డయాక్సైడ్, జాంతం గమ్ వంటివి వినియోగిస్తున్నగట్లు గతంలో తనిఖీల్లో తేలింది. తాజాగా మలక్ పేటకు చెందినదిగా చెబుతున్న ఈ వీడియోలో ఏకంగా కాళ్లతో తొక్కుతూ పేస్ట్ తయారు చేయడం కలకలం రేపుతున్నది. సో రెడీమేడ్ అల్లం కొనుగోలు చేసే వారు బీ కేర్ ఫుల్ అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..