ప్రీతి హెల్త్ బులిటెన్ విడుదల
వరంగల్ కేఎంసీ స్టూడెంట్ డాక్టర్ ప్రీతి హెల్త్ బులిటెన్‌ను నిమ్స్ వైద్యులు కాసేపటి క్రితం విడుదల చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ కేఎంసీ స్టూడెంట్ డాక్టర్ ప్రీతి హెల్త్ బులిటెన్ ను నిమ్స్ వైద్యులు కాసేపటి క్రితం విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిపారు. నాలుగు రోజులుగా ప్రీతికి వైద్యులు ఆమెకు ట్రీట్ మెంట్ చేస్తున్నా పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇంకా ఎక్మో సపోర్టుతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రీతిని కాపాడేందుకు శ్రమిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రీతీ ఆత్మహత్యాహత్నంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. న్యూరాలజీ, జనరల్ ఫిజిషియన్, కార్డియాలజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకుందని, దీని ప్రభావం శరీరంలోని భాగాలపై విపరీతంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముఖ్యంగా బ్రెయిన్ పై మత్తు ఇంజెక్షన్ ప్రభావం ఎక్కువగా పడిందన్నారు.
ఈ నేపథ్యంలో ప్రీతికి మెరుగైన వైద్యం కోసం వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయిందన్నారు. కాగా ఈ కేసులో నిందితుడు సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఇవి కూడా చదవండి: బ్రేకింగ్: తెలంగాణలో మరో మెడికో సూసైడ్.. కలకలం రేపుతోన్న వరుస ఘటనలు