‘అన్ని మతాలకు సచివాలయంలో ప్రార్థనా మందిరాలు’

రాష్ట్ర సచివాలయం ప్రజాస్వామ్యానికి, ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు.

Update: 2023-05-30 14:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర సచివాలయం ప్రజాస్వామ్యానికి, ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. సచివాలయ ప్రాంగణంలో ప్రభుత్వం నిర్మిస్తున్న చర్చి నిర్మాణ పనులను మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రాజీవ్ సాగర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రం సర్వమతాలు సమానంగా స్వేచ్ఛ సమానత్వాన్ని పొందుతున్నాయని పేర్కొన్నారు.

గంగా జమున తెహజీబ్ కు సచివాలయం ప్రతీకగా నిలుస్తుందన్నారు. హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా ప్రతి మతానికి సచివాలయంలో ప్రార్ధనా మందిరాలు నిర్మిస్తుందన్నారు. ఇప్పటికే ఉప్పల్ భగాయత్‌లో క్రిస్టియన్ భవన్ కోసం 2 ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి రూ.10 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ కమిషన్ మాజీ చైర్మన్ శంకర్ లుక్, తెలంగాణ సెక్రెటేరియట్ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిట్టిబాబు తదితరులున్నారు. 

Tags:    

Similar News