బీజేపీకి కిచ్చా సుదీప్ మద్దతుపై ప్రకాశ్‌రాజ్ కామెంట్స్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ మద్దతు ప్రకటించడం హాట్‌టాపిక్‌గా మారింది. కర్ణాటకలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతుగా నిలవడం ప్రస్తుతం రాజకీయంగా
దిశ, డైనమిక్ బ్యూరో : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ మద్దతు ప్రకటించడం హాట్‌టాపిక్‌గా మారింది. కర్ణాటకలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతుగా నిలవడం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కిచ్చా సుదీప్ నిర్ణయంపై సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. సుదీప్ నిర్ణయం తనను విస్మయానికి గురి చేసిందన్నారు. ‘సుదీప్ నిర్ణయం నన్ను విస్మయానికి గురిచేసింది. నేను ఎంతో బాధపడ్డా. నిరాశలో కూరుకుపోయిన బీజేపీ అసత్యప్రచారం చేసిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సుదీప్ ఒకరి ఎరలో పడేంత తెలివి తక్కువ వ్యక్తి కాదు’ అని ప్రకాశ్‌రాజ్ ఊహించని విధంగా ట్వీట్ చేశారు. దీంతో సుదీప్ అభిమానులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఫలితంగా ఇది కర్నాటకలో హాట్ టాపిక్ అవుతోంది. కాగా, బుధవారం కిచ్చా సుదీప్ బీజేపీకి తన మద్దతును ప్రకటించాడు. తాను పార్టీ కోసం ప్రచారం చేస్తానని, మే 10 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు.