POW: అల్లు అర్జున్ ఏమైనా త్యాగం చేశాడా..? ప్రగతిశీల మహిళా సంఘం నేత సంధ్య

అల్లు అర్జున్(Allu Arjun) ఏమైనా త్యాగం(sacrifice) చేశాడా? అని ప్రగతి శీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య(Pragathi Sheela Mahila Sangam President Sandhya) ప్రశ్నించారు.

Update: 2024-12-17 09:39 GMT

దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్(Allu Arjun) ఏమైనా త్యాగం(sacrifice) చేశాడా? అని ప్రగతి శీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య(Pragathi Sheela Mahila Sangam President Sandhya) ప్రశ్నించారు. సంథ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theater stampede) ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ అనే బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన ఆమె సినీ ఇండస్ట్రీపై(Film Industry) మండిపడ్డారు. ఆమె మాట్లాడుతూ.. పేద వాళ్ల ప్రాణం పోయినా ఎవరికి పట్టదు.. కానీ ఆ హీరో ఏదో త్యాగం చేసినట్టుగా సినీ ఇండస్ట్రీ మొత్తం పరామర్శకు క్యూ కట్టారని అన్నారు. ఆయనకు ఒకే రోజు బెయిల్ వచ్చిందని అయినా కూడా ఆయన ఏదో యుద్దం గెలిచి త్యాగం చేసినట్టు ఎంతో దూరం నుంచి వచ్చి వెళుతున్నారని, వెంటిలేటర్ మీద చావుబతుకుల మధ్య ఉన్న బాలుడ్ని ఎవరు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిమ్స్ ఆసుపత్రి(KIMS Hospital) వర్గాలు ఇంతవరకు ఎలాంటి హెల్త్ బులిటెన్(Health Bulletin) విడుదల చేయలేదని, వెంటనే బాలుడి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని, అలాగే బాదిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని సంధ్య కోరారు.

Tags:    

Similar News