‘కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు!’
తెలంగాణ ఆడబిడ్డగా చెప్పుకునే కవిత డబ్బు కోసం కక్కుర్తి పడి లిక్కర్ కేసులో ఇరుక్కుని తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని మంటగలిపిందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఆడబిడ్డగా చెప్పుకునే కవిత డబ్బు కోసం కక్కుర్తి పడి లిక్కర్ కేసులో ఇరుక్కుని తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని మంటగలిపిందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై తాను కవిత బినామిని అంటూ ఆన్ రికార్డుగా చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. దీంతోనే బీజేపీ, బీఆర్ఎస్ స్నేహబంధం ఏంటో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కవితకు ఈడీ నోటీసుల అంశంపై బుధవారం స్పందించిన పొన్నం.. కవితను అరెస్ట్ చేసే విషయంలో బీజేపీ ఎందుకు వెనకాముందు ఆలోచన చేస్తోందని ప్రశ్నిచారు. గతంలో తమ నాయకురాలు సోనియా గాంధీని దర్యాప్తు సంస్థలు తమ కార్యాలయానికి పిలిపించుకుని ప్రశ్నిస్తే కవితను మాత్రం అధికారులే ఇంటికి వెళ్లి విచారించారని గుర్తు చేశారు. ఈ విషయాలన్నింటిని ప్రజలు గమనించాలన్నారు.
Read more:
‘దేశం ముందు తెలంగాణ సిగ్గుతో తలవంచుతోంది’...MLC కవిత వ్యాఖ్యలపై ఎంపీ అర్వింద్ సీరియస్