Ponnam: ఇందులో సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరున్నా వదిలేది లేదు.. మంత్రి పొన్నం
డ్రగ్స్, హుక్కా నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ ఉన్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: డ్రగ్స్, హుక్కా నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ ఉన్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం శాసనమండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. హుక్కా సెంటర్లను నిషేదిస్తూ ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు. సీ2 పీఏ సెంట్రల్ యాక్ట్ పై ఇప్పటికే ప్రెసిడెన్షియల్ కి పంపించామన్నారు. 12 హుక్కా పార్లాల్ లు హైకోర్టు అనుమతి తీసుకొని నడుపుతున్నాయన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లినా, వదలిపెట్టమన్నారు. రాజకీయ ,సినీ ప్రముఖులు ఎవరూ చట్టం నుండి పారిపోలేరన్నారు. నార్సింగి ఫిల్మ్ యాక్టర్ కి సంబంధించిన కేసు నడుస్తుందన్నారు. గచ్చిబౌలి లో కొకైన్ కి సంబంధించిన కేసు కూడా ఉన్నదన్నారు. ఇక మొకిలాలో కొకైన్ కేసు వంటివాటిపై సర్కార్ సీరియస్ గా ఫోకస్ పెట్టిందన్నారు. ఫామ్ హౌజ్ లలో పార్టీలు చేసుకున్నప్పుడు కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ లో మద్యపాన నిషేధం లేదని, పార్టీలలో మద్యం అనుమతి తీసుకొని డీడీలు చెల్లించి పార్టీలు చేసుకోవాలన్నారు. పార్టీల పేరుతో డ్రగ్స్, అశ్లీలత ఉంటే చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాలేజీలు, పాఠశాలలపై నిరంతర నిఘా ఉంచామన్నారు. 10 సంవత్సరాలుగా పాలించినోళ్లు, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపిఉంటే, ప్రస్తుతం ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు.