దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే బయటికొచ్చిన పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరగా, తాజాగా తనకు టికెట్ రాకపోవడంతో తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది. అయితే ఈ నేపథ్యంలో శనివారం తుమ్మల ఇంటికి పొంగులేటి వెళ్లి బేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు కాసేపు చర్చించారు. తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు పొంగులేటి తెలిపారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. వినాశకాలే విపరీత బుద్ధి అన్న చందంగా బీఆర్ఎస్ వ్యహరిస్తోందన్నారు. తుమ్మలకు అపారమైన రాజకీయ అనుభవం ఉందన్నారు. ఏ పార్టీలో ఉన్నా తుమ్మల చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. ఇక, పార్టీ మార్పు ప్రచారం సందర్భంగా మాజీ మంత్రి తుమ్మల నివాసం వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల అభిమానులు భారీగా తుమ్మల ఇంటికి తరలివస్తున్నారు. అనుచరులు, అభిమానులతో చర్చించి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని తుమ్మల స్పష్టం చేశారు.
Read More : కోటి ఓట్లు టార్గెట్.. CM KCR మైండ్ బ్లోయింగ్ స్కెచ్!