పోలింగ్ స్టేషన్లు కూడా ఐపీఎల్ మ్యాచ్ లాగే హౌజ్ ఫుల్ అవ్వాలి!.. సీఈవో వికాస్ రాజ్

ఐపీఎల్ మ్యాచ్ లు హౌస్ ఫుల్ గా ఉంటున్నాయని, అలాగే పోలింగ్ రోజు కూడా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.

Update: 2024-04-21 07:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ మ్యాచ్ లు హౌస్ ఫుల్ గా ఉంటున్నాయని, అలాగే పోలింగ్ రోజు కూడా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు మాట్లాడుతూ.. వేడి కారణంగా ఓటింగ్ శాతం తగ్గు ముఖం పట్టడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎండ వేడి నుంచి కాపాడేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద కుర్చీలు, ఫ్యాన్లతో పాటు వడదెబ్బ లాంటివి వచ్చిన చూసుకునేందుకు పారా మెడికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణలో 3 కోట్ల 30 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, వారికి అన్ని సదుపాయాలు సమకూర్చడానికి 3 లక్షల మంది సిబ్బంది అదే ఎండలో పని చేస్తారని, దయచేసి అందరూ ఓటు వేయాడానికి పోలింగ్ కేంద్రాలకు రావాలని అభ్యర్ధించారు. అలాగే తాను ఈ మధ్య ఐపీఎల్ సీజన్ చూస్తున్నానని, టికెట్లకు బాగా డిమాండ్ పెరిగిందని, ప్రజలు వేడిని సైతం లెక్కచేయకుండా మ్యాచ్ చూడటానికి వెళుతున్నారని, అలాగే పోలింగ్ కేంద్రాలకు కూడా వచ్చి మీ ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేశారు. అది మీ బాధ్యత అని, ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైనదేనని, ఒక్క ఓటుతో పరిస్థితులు మారిపోయే అవకాశం ఉందని దయచేసి అందరూ ఓటు వేయాలని వికాస్ రాజ్ కోరారు.


Similar News