మామిడిపళ్ల థీమ్‌తో పోలింగ్ స్టేషన్.. ఎక్కడో తెలుసా..?
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సిటీలో ఓటింగ్ మందకోడిగా సాగుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఆశాజనకంగా ఉంది. అయితే పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ధర్మపురిలో ఓ పోలింగ్ స్టేషన్ ఈ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆదర్శ పోలింగ్ కేంద్రం కాన్సెప్ట్‌తో ప్రత్యేకంగా అలంకరించారు. వచ్చే వారికి స్వాగతం చెబుతున్నట్లుగా మామిడి పళ్లను ఉంచారు. పోలింగ్ స్టేషన్ ను బెలూన్లతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వాగతం, సుస్వాగతం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం ముందు రంగురంగులతో ముగ్గులు వేశారు. ఓట్ల పర్వం, ఓటే సర్వం అనే నినాదంతో ప్రజాస్వామ్య పండుగలో అందరం పాల్గొందాం అంటూ వినూత్నంగా పోలింగ్ కేంద్రాన్ని ముస్తాబు చేశారు. ఈ పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన ఫొటోలను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలంగాణ ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.