పోలింగ్ రోజు వేతన సెలవును అమలు చేయాలి: సీపీఎం నాయకుల డిమాండ్

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రోజున అన్ని పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు వేతనంతో కూడా సెలవును మంజూరు చేయాలని సీఈవో వికాస్‌రాజ్‌‌కు ఆదివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నరసింహారావు విజ్ఞప్తి చేశారు.

Update: 2024-05-12 15:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రోజున అన్ని పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు వేతనంతో కూడా సెలవును మంజూరు చేయాలని సీఈవో వికాస్‌రాజ్‌‌కు ఆదివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నరసింహారావు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్లమెంట్‌ పోలింగ్‌ రోజున పరిశ్రమల్లో పని చేసే అన్ని షిఫ్టుల కార్మికులకు జీవో నెం.222 ప్రకారం వేతనంతో కూడిన సెలవు‌ను వర్తింపజేయాలని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ రోజు అన్ని షిఫ్టుల్లో పని చేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్‌తో పాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల పరిశ్రమల్లో పనిచేసే వారు పని ప్రదేశంలో కాకుండా, వారి సొంత గ్రామాల్లో ఓటు హక్కును కలిగి ఉన్నారని పేర్కొన్నారు. నైట్‌ షిఫ్టు రద్దయితే నైట్‌ షిఫ్టు డ్యూటీకి హాజరయ్యే వారు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండదని తెలిపారు. 

Tags:    

Similar News