ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై రాజ‌కీయాలు త‌గ‌వు.. మంత్రి సీతక్క

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజ‌న ఆశ్రమ పాఠ‌శాలలో జ‌రిగిన ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై రాజ‌కీయాలు మానుకోవాల‌ని పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ‌, ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి డాక్టర్ ధ‌న‌స‌రి అన‌సూయ సీతక్క హిత‌వు పలికారు.

Update: 2024-11-05 16:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజ‌న ఆశ్రమ పాఠ‌శాలలో జ‌రిగిన ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై రాజ‌కీయాలు మానుకోవాల‌ని పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ‌, ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి డాక్టర్ ధ‌న‌స‌రి అన‌సూయ సీతక్క హిత‌వు పలికారు. ఫుడ్ పాయిజన్‌తో అనారోగ్య బారిన ప‌డిన విద్యార్ధుల‌ను ప్రభుత్వం ప‌ట్టించుకోలేదని మాజీ మంత్రి హ‌రీష్‌రావు చేస్తున్న వ్యాఖ్యలు అసత్యమని ఆమె మంగళవారం ఓ ప్రకటనలో వివరించారు.

ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే.. త‌మ ప్రభుత్వం త‌క్షణమే స్పందించింద‌ని మంత్రి సీత‌క్క తెలిపారు. బాధితుల‌కు మెరుగైన వైద్యాన్ని ప్రభుత్వం అందించింద‌ని మంత్రి సీత‌క్క గుర్తు చేశారు. తానే స్వయంగా ఆసిఫాబాద్ క‌లెక్టర్ వెంక‌టేష్ దోత్రే, ఐటీడీవో పీవో ఖుష్బూ గుప్తా‌ల‌తో స‌మ‌న్వయం చేసుకుంటూ విద్యార్దుల‌కు ఏలాంటి అపాయం జ‌రగకుండా త‌గు చర్యలు చేప‌ట్టిన‌ట్లు మంత్రి సీతక్క వివరించారు. ఇలాంటి ఘ‌ట‌నలు జ‌ర‌క్కుండా హెల్త్ మానిట‌రింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు ఆమె వివరించారు.

ఘ‌ట‌న జ‌రిగిన క్షణం నుంచి ఐటీడీవో పీవో ఖుష్బూ గుప్తా ద‌గ్గరుండి మ‌రీ విద్యార్ధుల‌కు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేప‌ట్టార‌ని తెలిపారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్దుల ఆరోగ్య ప‌రిస్థితిని నిమ్స్ సూప‌రిండెంట్ సత్యనారాయణ, డాక్టర్లతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మానిట‌ర్ చేసిన‌ట్లు సీత‌క్క తెలిపారు. స్వయంగా సీఎం కార్యాల‌యం సైతం నిరంతం విద్యార్ధుల యోగ‌క్షేమాల‌ను తెలుసుకుంటూనే ఉంద‌ని.. మంచిర్యాల మాక్స్‌క్యూర్ ఆసుపత్రిలో చికిత్స అందించి మ‌రింత మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు త‌ర‌లించిన‌ట్లు తెలిపారు.

ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై రాజ‌కీయాలు త‌గ‌వు.. మంత్రి సీతక్కవిద్యార్థినుల వైద్య ఖ‌ర్చుల‌తో పాటు ర‌హ‌దారి ఖ‌ర్చులు పూర్తిగా ప్రభుత్వమే భ‌రించిన‌ట్లు మంత్రి సీత‌క్క అన్నారు. ఇప్పటికే రూ.5 లక్షల మేర బిల్లుల‌ను చెల్లించిన‌ట్లు పేర్కొన్నారు. వైద్య ఖ‌ర్చులను ప్రభుత్వమే భ‌రిస్తున్నట్లు తెలిపారు. త‌న వంతు బాధ్యతగా స్థానిక ఎమ్మెల్యే కోవా ల‌క్ష్మీ బాధితుల‌కు ఆర్ధిక స‌హ‌యం చేసి ఉండవచ్చని అన్నారు. వాస్తవానికి సోమ‌వారమే నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్ధుల‌ను విజిట్ చేయాల‌ని తాను భావించినా విద్యార్ధులు ఐసీయూలో చికిత్స పొందుతున్నందున చూడ‌టానికి వీలు కాలేద‌ని ఆమె మంత్రి సీతక్క తెలిపారు.


Similar News