కేటీఆర్‌ను అడ్డుకున్న పోలీసుల భార్యలు.. అసెంబ్లీలో మాట్లాడుతానని హామీ
ఆదిలాబాద్ పోరుబాటకు వెళ్తో్న్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)ను పోలీసుల భార్యలు(Police Wives) అడ్డుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ పోరుబాటకు వెళ్తో్న్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)ను పోలీసుల భార్యలు(Police Wives) అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ను వేడుకున్నారు. అంశాన్ని అసెంబ్లీలో చర్చిస్తామని.. తప్పకుండా న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల భార్యల ధర్నాతో నిజామాబాద్-కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కాగా, రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ ఉద్యమబాట చేపట్టిన విషయం తెలిసిందే. గురువారం ఆదిలాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించతలపెట్టారు. ఈ సభలో పాల్గొనేందుకు కేటీఆర్ ఆదిలాబాద్ వెళ్తుండగా పోలీసుల భార్యలు అడ్డుకున్నారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి పాలనలో ఎవరూ సంతోషంగా లేరని కేటీఆర్ అన్నారు.