రేపటినుంచే గణపతి ఉత్సవాలు షురూ.. పోలీసులు విధించిన ఆంక్షలు ఇవే

గణపతి నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ మహా నగరం సిద్ధమైంది. ఏ గల్లీలో చూసిన సందడి వాతావరణం కనిపిస్తోంది. మండపాలు, లైటింగ్స్‌లో హడావిడి నెలకొంది.

Update: 2024-09-06 12:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: గణపతి నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ మహా నగరం సిద్ధమైంది. ఏ గల్లీలో చూసిన సందడి వాతావరణం కనిపిస్తోంది. మండపాలు, లైటింగ్స్‌లో హడావిడి నెలకొంది. భక్తుల పూజలందుకునేందుకు గణపతులు సిద్ధమయ్యాడు. మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నా.. హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించారు. దీని కోసం ఏడాది మొత్తం ఎదురుచూస్తారనడంలో సందేహం లేదు. ఎనిమిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తొమ్మిదో రోజున గ్రాండ్‌గా నిమజ్జనం చేస్తారు. ఈ క్రమంలో మండపాల నిర్వహకులకు హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు.

లాటరీలు, మద్యం సేవించడం, మండపాల్లో రాజకీయ, రెచ్చగొట్టే పాటలు, ప్రసంగాలపై పరిమితులను విధించారు. రాత్రి 10 గంటల తర్వాత మైకులు ఉపయోగించకూడదు. గణపతి మండపం కోసం ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేయకూడదు. రహదారులకు అడ్డంగా మండపాలను ఏర్పాటు చేయకూడదు. విద్యుత్ కనెక్షన్ తీసుకొనే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. భద్రత కోసం సీసీ కెమెరాలు తప్పనిసరి. పర్యావరణ నష్టాన్ని నివారించేందుకు నిర్దేశించిన చెరువుల్లో మాత్రమే విగ్రహ నిమజ్జనం చేయాలి. వాలంటీర్లు అన్ని సమయాల్లో అందుబాటులో, అప్రమత్తంగా ఉండాలి అని నగర పోలీసులు సూచనలు చేశారు.


Similar News