ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. వాట్సప్ ఛాటింగ్‌లో సంచలన విషయాలు

తెలంగాణలో కలకలం రేపుతోన్న గ్రూప్-2 అభ్యర్థి

Update: 2023-10-14 12:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కలకలం రేపుతోన్న గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. యువతి రాసిన సూసైడ్ లెటర్‌ కీలకంగా మారగా.. దీనిని పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. గ్రూప్-2 ఎగ్జామ్ వాయిదా పడటం వల్లనే మనస్తాపంతో ప్రవళిక బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతుండటంతో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోన్నాయి.

ప్రవళిక ఆత్మహత్యపై పోలీసులు కీలక విషయాలు బయటపెట్టారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా తేల్చారు. శివరామ్ రాథోడ్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో ప్రవళికను మోసం చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రవళిక వాట్సప్ ఛాట్‌లను పరిశీలించగా.. ఈ విషయం వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. రాధోడ్ ప్రవళికను కాకుండా మరో యువతితో పెళ్లికి సిద్దమయ్యాడని చాటింగ్‌లను చూస్తే వెలుగులోకి వచ్చిందని వెల్లడించారు.

అంతేకాకుండా శివరామ్, ప్రవళిక ఓ హోటల్‌లో కనిపించిన సీసీ ఫుటేజీ కూడా లభించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. గ్రూప్-2 ఎగ్జామ్ రాయడానికే ప్రవళిక హైదరాబాద్ వచ్చిందని, కానీ వ్యక్తిగత కారణాల వల్ల సూసైడ్ చేసుకుందని దర్యాప్తులో బయటపడినట్లు చెప్పారు. ప్రవళిక సూసైడ్ నోట్, సెల్‌ఫోన్, సీసీటీవీ ఫుటేజీని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించామని, త్వరలోనే మరిన్ని విషయాలు బయటపడతాయని పోలీసులు వెల్లడించారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు నిరుద్యోగులు ఆందోళన చేపడుతున్నారని, అందులో నిజం లేదని పేర్కొన్నారు.

Tags:    

Similar News