తెలంగాణ ఎన్నికలపై పోలీస్ శాఖ అలర్ట్.. నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్

తెలంగాణ ఎన్నికలపై పోలీస్ శాఖ అలర్ట్ అయింది. ఎన్నికల

Update: 2023-10-31 09:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికలపై పోలీస్ శాఖ అలర్ట్ అయింది. ఎన్నికల ప్రచారంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానున్న తరుణంలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఒక్కో నామినేషన్ కేంద్రం దగ్గర ఏసీపీ స్థాయి అధికారి భద్రతను పర్యవేక్షించనున్నారు. ర్యాలీలు, సమావేశాల అనుమతులపై ఎన్నికల అధికారులతో పోలీస్ శాఖ సమన్వయం చేసుకోనుంది. రాచకొండ పరిధిలో 19 చెక్ పోస్టులు ఏర్పాటు చేయగా.. ప్రతి నియోజకవర్గంలో ముగ్గురు ప్లయింగ్ స్క్వాడ్స్ ఉండనున్నారు.


Similar News