రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. హరీశ్‌రావుపై ఫిర్యాదు
రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో హరీశ్‌రావుపై పోలీసు ఫిర్యాదు అందింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు అయింది. హరీశ్ రావుకు వ్యతిరేకంగా బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఫిర్యాదు చేశారు. సీఎంపై రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హరీశ్ రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన హరీశ్ రావు సీఎంపై ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్ రావుపై పోలీసులకు ఫిర్యాదు అందడం హాట్ టాపిక్ అయింది.