TG POLICE : నిరుపేద అంధుడికి ఇల్లు కట్టించిన పోలీసులు

శాంతిభద్రతల పరిరక్షణే కాదు.. సామాజిక బాధ్యతల్లోనూ ముందుంటారని కొందరు పోలీసులు నిరుపిస్తుంటారు.

Update: 2024-07-28 12:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: శాంతిభద్రతల పరిరక్షణే కాదు.. సామాజిక బాధ్యతల్లోనూ ముందుంటారని కొందరు పోలీసులు నిరుపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ నిరుపేద అంధుడికి తాజాగా ఇల్లు కట్టించి మానవత్వం పోలీసులు చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్ద నాగారం గ్రామానికి చెందిన నిరుపేద అంధుడు మందుల నాగన్న పాటలు పాడుతూ జీవనం సాగించేవారు.

అతని దీన స్థితిని ఎస్ఐ ద్వారా తెలుసుకున్న జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ దాతల సహకారంతో నిరుపేద అంధుడికి ఇల్లు కట్టించారు. అనంతరం ఆ ఇంటి గృహప్రవేశానికి సైతం ఎస్పీ హాజరయ్యారు. ఇంటి ఆవరణలో ఒక మొక్కను సైతం నాటారు. పోలీస్ శాఖ, కొంత మంది దాతల సహాయంతో గృహ నిర్మాణం చేపట్టినట్లు ఎస్పీ చెప్పారు. సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండే కార్యక్రమాలకు పోలీస్ శాఖ తరపున సపోర్ట్ ఉంటదని సుధీర్ రాంనాద్ ఎస్పీ వెల్లడించారు.

Tags:    

Similar News