జైల్లో ఉండగానే ఫోన్ ట్యాపింగ్ నిందితుడు రాధాకిషన్ రావు అరెస్టు

ఫోన్ ట్యాపింగ్ నిందితుడు రాధాకిషన్ రావు మరొక కేసులో అరెస్ట్ అయ్యారు.

Update: 2024-07-04 10:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా పీటీ వారెంట్ పై పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఓ ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించినందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కంపెనీ వ్యవహారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేశారని, రూ. 150 కోట్ల కంపెనీని తక్కువ ధరకే మరొకరికి ఇప్పించారని రాధాకిషన్ రావు పై ఓ వ్యాపారవేత్త ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇవాళ పీటీ వారెంట్ కింద అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరు పరిచి అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుది కీలక పాత్ర అని పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన కీలకమైన డేటా ధ్వంసం కుట్రలోనూ ఆయన పాత్ర ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్లను ఉపయోగిచిన ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు. ఈ సమాచారం బయటకు వస్తే ఎక్కడ తమ భండారం బయటపడుతుందనే భయంతోనే రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతన్నతో కలిసి డేటాను ధ్వంసం చేసినట్లు దర్యాప్తు బృందం ఇదివరకే గుర్తించింది.

Tags:    

Similar News