ప్లీజ్..నాకు ఆ పోస్టు వద్దు! సర్కారుకు 'అకడమిక్ డీఎంఈ' లేఖ
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలోని అకడమిక్ డీఎంఈ(ఇన్ చార్జి)గా.. విధులు నిర్వహించలేనని, తనను ఆ పోస్టు నుంచి తప్పించాలని డాక్టర్ శివరాం ప్రసాద్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది.
దిశ, వెబ్ డెస్క్: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలోని అకడమిక్ డీఎంఈ(ఇన్ చార్జి)గా.. విధులు నిర్వహించలేనని, తనను ఆ పోస్టు నుంచి తప్పించాలని డాక్టర్ శివరాం ప్రసాద్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది. ఈ లేఖను జనరల్ ట్రాన్స్ ఫర్ల కంటే ముందే రాసినా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను అకడమిక్ డీఎంఈ గా విధులు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నానని, తన అభ్యర్ధనను పరిగణలోకి తీసుకోవాలని, లేఖలో కోరినట్లు శివరాం ప్రసాద్ సన్నిహితులు తెలిపారు. ఈ మేరకే.. ఆయన గత కొన్ని రోజుల నుంచి డీఎంఈ ప్రధాన కార్యాలయానికి కూడా రావడం లేదని వివరించారు. అయితే ఆయన నిజంగానే వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారా? లేక ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది.