‘ఫుడ్ ప్రాసెస్ జోన్ల ఏర్పాటుకు ప్రణాళికల రూపొందించాలి’

ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ప్రోత్సహించడానికి వ్యూహాన్ని రూపొందించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. పెట్టుబడిదారులు ముందుకొస్తున్న ప్రాంతాల్లో ఏర్పాటుకు

Update: 2023-03-31 15:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ప్రోత్సహించడానికి వ్యూహాన్ని రూపొందించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. పెట్టుబడిదారులు ముందుకొస్తున్న ప్రాంతాల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల డిమాండ్ చేశారు. బీఆర్‌కేఆర్ భవన్‌లో శుక్రవారం రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ల ఏర్పాటు, సాధించిన పురోగతిపై పరిశ్రమల శాఖ అధికారులతోసమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహార, వ్యవసాయ రంగంలో ప్రతి జిల్లాలో డిమాండ్, సాధ్యాసాధ్యాల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో రైస్ మిల్లుల ఏర్పాటును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వచ్చే నాలుగైదు నెలల్లోగా రైస్‌మిల్లుల ఏర్పాటుకు భూముల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మిడ్ మానేరు రిజర్వాయర్‌ లో ఆక్వా హబ్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహా రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News