Wow.. ఇంద్రభవనంలా తెలంగాణ సచివాలయం (ఫొటోస్)
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయాన్ని ఈనెల 30న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే భవన నిర్మాణం దాదాపు పూర్తి కాగా, బీఆర్కేఆర్ భవనం నుంచి ఇవాళ్టి(ఏప్రిల్ 24) నుంచి షిఫ్టింగ్ కూడా ప్రారంభం కానుంది.
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయాన్ని ఈనెల 30న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే భవన నిర్మాణం దాదాపు పూర్తి కాగా, బీఆర్కేఆర్ భవనం నుంచి ఇవాళ్టి(ఏప్రిల్ 24) నుంచి షిఫ్టింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సచివాలయం లోపలి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంద్రభవనాన్ని తలపిస్తోన్న సచివాలయం చూపరులను కట్టిపడేస్తోంది. సరికొత్త కాంతులతో ఆకట్టుకుంటోంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం భవనం.. మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 8 ఎకరాలను పూర్తిగా పచ్చదనం కోసమే కేటాయించారు. అద్భుతమైన పార్కును అభివృద్ధి చేశారు. దానికి సంబంధించిన ఫొటోలు, లోపలి దృశ్యాల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం.