Aarogyasri services : తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత : నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్
తెలంగాణ ప్రభుత్వం(Telangana Government)నుంచి రావాల్సిన రూ.1200కోట్ల బకాయి(Dues)లు చెల్లించని కారణంగా ఆరోగ్య శ్రీ సేవల(Aarogyasri Services)ను నిలిపివేస్తున్నట్లు(Suspended) గా తెలంగాణ ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(Network Hospitals Association)సభ్యులు శుక్రవారం ప్రకటించారు.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Government)నుంచి రావాల్సిన రూ.1200కోట్ల బకాయి(Dues)లు చెల్లించని కారణంగా ఆరోగ్య శ్రీ సేవల(Aarogyasri Services)ను నిలిపివేస్తున్నట్లు (Suspended) గా తెలంగాణ ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(Network Hospitals Association)సభ్యులు శుక్రవారం ప్రకటించారు. ఈ నిలిపివేత తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వి.రాకేశ్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కింద రోగులకు సేవలు అందిస్తున్నప్పటికీ.. బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ఆయా జిల్లాల్లోని ఆసుపత్రున్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ స్కీంల కింద అందిస్తున్న వైద్య సేవలకు గానూ నెలకు దాదాపు రూ. 100 కోట్ల బిల్లులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలిపారు. సంవత్సరానికి అయితే రూ. 1200 నుంచి రూ. 1300 కోట్ల బిల్లులు చెల్లించాలని.. ఏడాదికి సంబధించిన రూ. 1200 కోట్ల బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్న కారణంగానే ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని డాక్టర్ రాకేశ్ పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆరోగ్య శ్రీ సేవలు ప్రారంభమయ్యాయని.. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం.. పెండింగ్ బకాయిలను చెల్లించకపోవడం, ఆరోగ్య శ్రీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోవడం ఇబ్బందిగా మారిందన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగినప్పుడల్లా రూ. 100 కోట్ల టోకెన్ అమౌంట్‌ను విడుదల చేయడం అలవాటుగా మారిందని..ఆ పద్ధతికి అంగీకరిస్తామనుకోవడం సరైంది కాదన్నారు. పూర్తి బిల్లుల చెల్లింపు జరిగే వరకు ఆరోగ్య శ్రీ సేవల నిలిపివేత కొనసాగుతోందని స్పష్టం చేశారు.