ఫోన్ ట్యాపింగ్ కేసు.. గాంధీ ఆస్పత్రికి భుజంగరావు, తిరుపతన్న

ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి పోలీస్ కస్టడీలో ఉన్న అదనపు ఎస్పీలైన భుజంగరావు, తిరుపతన్న కస్టడీ నేటితో ముగిసింది.

Update: 2024-04-02 04:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి పోలీస్ కస్టడీలో ఉన్న అదనపు ఎస్పీలైన భుజంగరావు, తిరుపతన్న కస్టడీ నేటితో ముగిసింది. దీంతో వీళ్లిద్దరిని వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోనిం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం నేరుగా నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. భుజంగరావు, తిరుపతన్నకు కోర్టు కస్టడీ పొడిగిస్తుందా? లేదా అనేది కాసేపట్లో తెలియనుంది. ప్రణీత్ రావు, రాధా కిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తిరుపతన్న, భుజంగరావును అధికారులు ప్రశ్నించారు. భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన ఆధారాలతో మరికొంతమందిని దర్యాప్తు బృందం విచారించనుంది. SIB మాజీ డైరెక్టర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డట్టు తిరుపతన్న, భుజంగరావు చెప్పారు.

Tags:    

Similar News