Court: ఫోన్ ట్యాపింగ్ కేసు.. భుజంగరావు‌కు మధ్యంతర బెయిల్ మంజూరు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే.. గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టి సారించింది.

Update: 2024-08-19 05:37 GMT

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే.. గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టి సారించింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ వ్యవహరం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులు అందరూ తాము కూడా బాధితులమే నని పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి కీలక ఆదారాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. కాగా ఈ కేసులో ఏ2గా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భుజంగరావు కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాదపడుతున్నానని.. చికిత్స నిమిత్తం ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆయనకు షరతులతో 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అలాగే భుజంగరావును హైదరాబాద్ నగరం విడిచిపెట్టి వెళ్లవద్దని కోర్టు ఆదేశించింది. కాగా ఫొన్ ట్యాపింగ్ కేసులో మార్చ్ 23న భుజంగరావును పోలీసులు అరెస్ట్ చేశారు. 


Similar News