రెండో శనివారం యథావిధిగా పాస్‌పోర్ట్ సేవలు

రెండో శనివారం అయిన రేపు కూడా (డిసెంబర్ 10) పాస్‌పోర్టు సేవలు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2022-12-09 13:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రెండో శనివారం అయిన రేపు కూడా (డిసెంబర్ 10) పాస్‌పోర్టు సేవలు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు.హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌, బేగంపేట, టోలిచౌకీ, కరీంనగర్‌, నిజామాబాద్‌ పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో సేవలు అందిస్తామని పేర్కొన్నారు. పాస్‌పోర్ట్‌ల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ విషయం గమనించాలన్నారు. తత్కాల్, సాధారణ పాస్ పోర్ట్ సేవలు రేపు అందుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్‌ రీజినల్‌ పాస్‌పోర్ట్‌ పరిధిలోని 14 పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు దరఖాస్తులను ప్రాసెస్‌ చేయడానికి ఈ సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. తత్కాల్‌ కేటగిరీ కింద ప్రాసెసింగ్‌ అప్లికేషన్‌ సమర్పించడానికి అర్హత ఉన్న పత్రాల జాబితా కోసం దరఖాస్తుదారులు పాస్‌‌పోర్ట్‌ సేవా పోర్టల్‌‌ని చూడవలసిందిగా చెప్పారు. దరఖాస్తు దారులందరూ www.passportindia.gov.in పోర్టల్‌ ద్వారా లేదా mPassportsevaయాప్‌లో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. 

Tags:    

Similar News