Metro Free Parking : నాగోల్ మెట్రో ప్రయాణికుల ధర్నా.. ఫ్రీ పార్కింగ్ కొనసాగించాలని డిమాండ్
నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత నిర్ణయం మరోసారి వివాదంగా మారింది.
దిశ, డైనమిక్ బ్యూరో: నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత నిర్ణయం మరోసారి వివాదంగా మారింది. సొమవారం నాగోల్ మెట్రో పార్కింగ్ వద్ద మెట్రో ప్రయాణికులు ధర్నా చేపట్టారు. తమకు ఉచిత పార్కింగ్ కొనసాగించాలని, కనీస వసతులు కల్పించాలని మెట్రో ప్రయాణికులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించే బాధ్యత ఎల్అండ్‌టీ మెట్రో సంస్థదేనని, ప్రభుత్వ భూమిలో పార్కింగ్ ఫీజు వసూలు చేయడం ఎమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
పార్కింగ్ ఫీజు చెల్లించినా వాహనాల రక్షణతో మాకు సంబంధం లేదని నిర్వాహకులు చెబుతున్నారని ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పటికే మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజు ఎత్తివేయాలని గతంలో ప్రయాణికులు నిరసనలు, ధర్నాలు చేశారు. ఈ క్రమంలోనే పార్కంగ్ నిర్ణయాన్ని మెట్రో పోస్ట్‌పోన్ చేస్తూ వస్తూ.. అక్టోబర్ 6 నుంచి వాహనాలకు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.