పార్టీ మార్పు ప్రచారం.. నలుగురు BRS ఎమ్మెల్యేల క్లారిటీ

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక), సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు), మాణిక్ రావు (జహీరాబాద్)లు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-01-24 05:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక), సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు), మాణిక్ రావు (జహీరాబాద్)లు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. ఇక ఈ అంశంపై బుధవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. పార్టీ మార్పు అంశంపై నలుగురు ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై చర్చించడానికే వెళ్లామని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నా అన్నారు. తాము కేసీఆర్ వెంటే ఉంటామన్నారు. తమపై రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ నేతల హామీలపై స్పష్టత లేదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిశామన్నారు. మాపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారన్నారు. అభివృద్ధి అంశాల్లో సహకరించాలని సీఎంను కోరామన్నారు. తమ పరువుకు భంగం కలిగేలా మాట్లాడితే న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ. నియోజకవర్గాల్లోని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సీఎంను కలిసామన్నారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్‌కే కాదని అందరి వ్యక్తి అన్నారు. ప్రధాన మంత్రిని కూడా గతంలో మూడు సార్లు కలిశామని.. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశామన్నారు. కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారాన్ని ఖండిస్తున్నా అన్నారు. ఉమ్మడి జిల్లా సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు.

Tags:    

Similar News