Padi Kaushik Reddy : దిగొచ్చిన పాడి! ముదిరాజ్‌లకు క్షమాపణలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిగివచ్చారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిగివచ్చారు. ముదిరాజ్ వర్గానికి చెందిన ఓ జర్నలిస్టును కౌశిక్ రెడ్డి దూషించినట్లు వైరల్ గా మారిన ఆడియో క్లిప్ విషయంలో రాజకీయ దుమారం రేగింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అయ్యాయి. కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీసీ కుల సంఘాలు, ప్రతిపక్షాల నుండి డిమాండ్లు పెరిగాయి.
దీంతో ఈ వ్యవహారంపై సోమవారం పాడి కౌశిక్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో నేను మాట్లాడినట్లుగా చక్కర్లు కొడుతున్న ఆడియో క్లిప్ ఫేక్ అని అన్నారు. తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని అది ఫేక్ ఆడియో క్లిప్ అని చెప్పారు. అయినా సరే వాటి వల్ల ముదిరాజ్ ల మనోభావాలు దెబ్బతిని ఉంటే తాను మనస్ఫూర్తిగా వారికి క్షమాపణలు చెబుతున్నానన్నారు.
ఈ ఫేక్ ఆడియోపై డీజీపీకీ ఫిర్యాదు చేసి ఫొరెన్సిక్ ల్యాబ్ కు పంపించి నిజానిజాలేంటో తేల్చాలని కోరుతానన్నారు. కాగా ముదిరాజ్ ల విషయంలో పాడికౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పడంతో ఈ వ్యవహారం ఇంతటితో ముగుస్తుందా లేక అది ఫేక్ ఆడియో అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతుందా అనేది ఉత్కంఠగా మారింది.
Also Read
Y. S. Sharmila : నన్ను చూసి కేటీఆర్‌కు భయం పట్టుకుంది: మంత్రిపై షర్మిల ఫైర్