Delhi Girl Shraddha Walker Case :హత్యపై ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న శ్రద్ధా వాకర్ హత్య కేసుపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న శ్రద్ధా వాకర్ హత్య కేసుపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రద్ధా వాకర్ హత్య వెనుక లవ్ జిహాద్ కోణం లేదన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇది ఒక మహిళపై జరిగిన దోపిడీ, వేధింపుల కేసుగా చూడాలని ఇలాంటి ఘటనలను అందరూ ఖండించాలన్నారు. బీజేపీ కావాలనే ఈ కేసులో తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఆజంగఢ్ లో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి సూట్‌కేస్‌లో ఉంచిన ఘటనను ఒవైసీ గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు బాధాకరమని వీటిని రాజకీయం చేయవద్దన్నారు. హిందూ ముస్లిం కోణంలో ఇలాంటి దారుణాలను చూడొద్దని హితవు పలికారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ ఘటనను మతపరమైన కోణంలో చూపించారని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో తమకు ఏ పార్టీ అనుమతి అక్కర్లేదని అన్నారు. తమ పోరాటం భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని ఇందుకోసం ఎవరితోనైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.