ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ప్రాక్టీస్‌కు 'అనాధ శవాలు'.. సర్కార్ ప్లాన్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా లభించిన అనాధ శవాలను మెడికల్ కాలేజీలకు తరలించాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీటిని ఎంబీబీఎస్ విద్యార్ధుల
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా లభించిన అనాధ శవాలను మెడికల్ కాలేజీలకు తరలించాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీటిని ఎంబీబీఎస్ విద్యార్ధుల ప్రాక్టీస్‌కు వినియోగించాలని ప్లాన్చేస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న రూల్స్‌లో కొన్ని సవరణలు చేయనున్నారు. న్యాయ పరమైన చిక్కులు రాకుండా ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం మంత్రి హరీష్‌రావు డీజీపీ మహేందర్‌రెడ్డి, హెల్త్ఆఫీసర్లతో భేటీ అయ్యారు. పూర్తిస్థాయిలో సమీక్షించి అభిప్రాయాలను సేకరించారు. అనంతరం సీఎం కేసీఆర్వద్దకు ఈ ప్రపోజల్ పంపినట్టు ఉన్నతాధికారుల్లో ఒకరు చెప్పారు. సీఎంవో నుంచి పర్మిషన్లు రాగానే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు.
కాలేజీలు పెరగడంతోనే.....
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకో మెడికల్ కాలేజీ చొప్పున ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. కొత్త కాలేజీలను అనుమతిచ్చే నేషనల్మెడికల్కమిషన్ కూడా ఇటీవల విజిట్ చేసి వివరాలను సేకరించింది. దీంతో వచ్చే అకాడమిక్సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఎంబీబీఎస్కోర్సు చేస్తున్న విద్యార్ధులకు ప్రాక్టీస్చేసేందుకు డెడ్‌బాడీలు ఎక్కువ సంఖ్యలో అవసరం అవుతాయి. దీంతో అనాధ శావాలను కొత్త మెడికల్ కాలేజీలకు తీసుకోవాలని హయ్యర్ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. సర్కార్ కూడా ఈ నిర్ణయానికి సుముఖంగానే ఉన్నది. సీఎం కేసీఆర్ఫైనల్ డెసిషన్ తీసుకోగానే ఈ విధానం అమల్లోకి రానున్నది.
పక్క రాష్ట్రాల నుంచి...
మన దగ్గర ప్రస్తుతం ఉన్న రూల్స్‌తో అనాధ డెడ్ బాడీలను మెడికల్ కాలేజీలకు తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కొన్ని సార్లు కర్ణాటక, తమిళనాడుల నుంచి తీసుకురావాల్సి వస్తుందని ఓ అధికారి చెప్పారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ ఎక్కువ శాతం ఇదే విధానాన్ని ఫాలో కావడం గమనార్హం.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో...
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అనాధ శావాలు లభిస్తే తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించి కొన్ని రోజుల వరకు ప్రీజర్ లో ఉంచి కోర్టు ఆదేశాలతో పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు చేయాలి. కానీ ప్రస్తుతం పోస్టు మార్టం అనంతరం పోలీసులు లేకుండానే కొన్ని సార్లు జీహెచ్ఎంసీ స్టాఫ్నేరుగా అంత్యక్రియలు చేసేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.