Delhi Liquor scam : కవిత దీక్షకు విపక్షాల భారీ మద్దతు

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా బిల్లు ఆమోదం కోసం రేపు కవిత దీక్ష చేపట్టనున్న సంగతి తెలిసిందే.

Update: 2023-03-09 04:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా బిల్లు ఆమోదం కోసం రేపు కవిత దీక్ష చేపట్టనున్న సంగతి తెలిసిందే. అయితే జంతర్ మంతర్ వేదికగా విపక్షాల బల ప్రదర్శన దిగనున్నట్లు తెలిసింది. జంతర్ మంతర్ వద్ద జరగనున్న ఎమ్మెల్సీ కవిత దీక్షకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తోంది. ఈ దీక్షకు 16 పార్టీలకు చెందిన ప్రతినిధులు, 29 రాష్ట్రాల నుంచి మహిళహక్కుల కోసం పోరాడే సంఘాలు, నేతల హాజరుకానున్నట్లు తెలిసింది. కవిత చేపట్టే దీక్షకు పలువురు కీలక నేతలు సంఘీభావం తెలపనున్నారు. దీక్షకు బీఆర్ఎస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, అకాలిలిదళ్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, ఆప్, ఆర్ఎల్డి, జేఎమ్ఎమ్ పార్టీల నుండి ప్రతినిధులు హాజరై సంఘీభావం తెలపనున్నారు.

Tags:    

Similar News