All Party Meeting: తెరపైకి ఆ మూడు రాష్ట్రాల స్పెషల్ స్టేటస్ ఇష్యూ.. హాట్ హాట్ గా ఆల్ పార్టీ మీటింగ్

బడ్జెట్ సమావేశాల వేళ అఖిల పక్ష సమావేశం హాట్ హాట్ గా సాగింది.

Update: 2024-07-21 09:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ ఆల్ పార్టీ మీటింగ్ హాట్ హాట్ గా సాగింది. నీట్ సమస్యను విపక్షాలు ప్రధానంగా లేవనెత్తాయి. ఈ అంశంపై సభలో చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అలాగే లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పోస్టుపై తేల్చాల్సిందే ఈ పదవిని విపక్షాలకు ఇవ్వాల్సిందే అని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.అలాగే ఈడీ, సీబీఐ వంటి సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదని ఈ ఏజెన్సీల దాడులతో పాటు పలు అంశాలపై చర్చకు ప్రతిపక్ష నేతలు పట్టుపట్టారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ, బీహార్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని జేడీయూ, ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేడీ నేతలు డిమాండ్ చేశారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించినందునా రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ కోరింది. కన్వర్ యాత్రపై యూపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని సమాజ్ వాదీ పార్టీ ప్రస్తావించింది. ఈ సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నుంచి జైరామ్ రమేశ్, కె. సురేశ్, టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు, వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, బీఆర్ఎస్ నుచి కే.ఆర్ సురేశ్ రెడ్డి, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ, లోక్ జనశక్తి నుంచి చిరాగ్ పాశ్వాన్, జనసేన నుంచి బాలశౌరి తదితరులు హాజరయ్యారు. కాగా ఈ మీటింగ్ కు తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఎల్లుండి పార్లమెంట్ లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.

Read More..

AP News:మంత్రి లోకేష్ చొరవ..ఆ గ్రామానికి బస్సు సర్వీసు!

Tags:    

Similar News