11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే కుట్రను వ్యతిరేకించండి.. మావో ప్రకటన విడుదల
బీఆర్ఎస్ ప్రభుత్వం 11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకించాలని మావోయిస్టు పార్టీ (జేఎండబ్ల్యూపీ) జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పిలుపునిచ్చారు.
దిశ, వరంగల్ బ్యూరో, కాటారం : బీఆర్ఎస్ ప్రభుత్వం 11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకించాలని మావోయిస్టు పార్టీ (జేఎండబ్ల్యూపీ) జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం పత్రిక ప్రకటనను విడుదల చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 11కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడం ఆదివాసుల వినాశనానికి తల పెట్టడమే అవుతుందని పేర్కొన్నారు.
వాల్మీకి బోయ, బేదక, కిరాతక, నిషాడీ, పెద్ద బోయలు, తలయారి, చుండువాళ్లు, ఖాయితీలతో పాటు బోటీ మధురాలు, చమక్ మధురాలు, మాతిలను ఎస్టీ జాబితాలో చేర్చే కుత్రంత్రం జరుగుతోందన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదానికి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. ఈ తీర్మానాలను అమలులోకి తీసుకొస్తే అర్హులైన ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. అందుకే 11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే కుట్రపై వ్యతిరేక పోరాటం చేయాలని ప్రకటనలో పిలుపునిచ్చారు.