వన్ టౌన్ పీఎస్ లిమిట్స్‌లో ఆపరేషన్ చబుత్ర
నిజామాబాద్ నగరంలో పోలీసులు ఆపరేషన్ చబుత్ర నిర్వహించారు.
దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలో పోలీసులు ఆపరేషన్ చబుత్ర నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి నిజామాబాద్ ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో విజయబాబు నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ జగడం నరేష్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 50 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. 150 మందిని అదుపులోకి తీసుకున్నారు.
నగరంలో శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం రాత్రి వేళ తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని బైక్‌లను సీజ్ చేశారు. నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, రాష్ట్రపతి రోడ్డు, గాంధీచౌక్, జనరల్ ఆస్పత్రి ప్రాంతాలలో తనికి నిర్వహించారు. రాత్రివేళ దుకాణాలు హోటళ్లు, పాన్ షాపులు తెరిచి ఉంచిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. సమయపాలన పాటించకపోతే చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు.