BRS ఆఫీస్ ప్రారంభం.. కవిత ఆసక్తికర ట్వీట్
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఇనాగరేషన్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఇనాగరేషన్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా ప్రారంభించిన పార్టీ అనేక ఒడిదొడుకులను ఎదుర్కుని తెలంగాణ సిద్ధాంతాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి ఆలోచనలను నిజం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.. తెలంగాణ రాష్ట్రం కోసం 39 పార్టీలను ఒప్పించిన కేసీఆర్ సంకల్పం ఆయన నిబద్ధతకు నిదర్శనం. తెలంగాణ ఏర్పాటు, అభివృద్ధి కోసం కేసీఆర్‌కు ఉన్న రాజనీతిజ్ఞత, పట్టుదలే నేడు లోక్‌సభలో 9 ఎంపీలు, రాజ్యసభలో 7 ఎంపీలు, తెలంగాణలో 105 మంది ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ శక్తి కేంద్రంగా ఎదిగింది. మా పార్టీ ఢిల్లీ కార్యాలయాన్ని ప్రారంభించడం ప్రతి గులాబీ సైనికుడికి గర్వకారణం. ఇది మా దార్శనిక నాయకుడు కేసీఆర్, ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరికి అద్భుతమైన ప్రయాణం’.. అంటూ కవిత ట్వీట్ చేశారు. ఈ మేరకు కేసీఆర్ ఫోటోను ట్వీట్ కు జత చేశారు.